logo
సినిమా

బాలీవుడ్ సినిమాల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్

Salman Khan Has Made Comments on Bollywood Movies
X

బాలీవుడ్ సినిమాల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్ 

Highlights

*బాలీవుడ్ సినిమాల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్

Salman Khan: ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మధ్యనే జరిగిన IIFA 2022 ప్రెస్ కాన్ఫరెన్స్ లో హాజరైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాల గురించి కొన్ని ఆసక్తికరమైన స్టేట్మెంట్లు చేశారు సల్మాన్. అలాగే మెగా కుటుంబంతో సల్మాన్ ఖాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ మెగా కుటుంబంతో తన బంధం గురించి కూడా చెప్పుకొచ్చారు. "రామ్ చరణ్ కూడా నాకు చాలా మంచి స్నేహితుడు. అర్ఆర్ఆర్ సినిమాలో చాలా బాగా నటించాడు. పుట్టినరోజు మరియు అర్ఆర్ఆర్ సక్సెస్ గురించి కూడా శుభాకాంక్షలు తెలిపాను. చరణ్ ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది" అని అన్నారు సల్మాన్ ఖాన్.

"మన సినిమాలు ఎందుకు సౌత్ ఇండస్ట్రీలో బాగా ఆడటం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. సౌత్ సినిమా మాత్రం ఇక్కడ చాలా బాగా ఆడుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా గా హీరోయిజం ఉండే సినిమాలు తీస్తున్నారు. నేను చిరంజీవిగారితో ఒక సౌత్ సినిమాలో నటిస్తున్నాను. వాళ్ల స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా విభిన్నంగా ఉంటుంది. సౌత్లో రైటర్లు కూడా చాలా కష్టపడి అందమైన కాన్సెప్ట్ లతో ముందుకు వస్తున్నారు. మనం కూడా అలాంటి సినిమాలు చేస్తూ ఉండాలి. ఒక సినిమా చూడగానే రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉండాలి" అని అన్నారు సల్మాన్ ఖాన్.

Web TitleSalman Khan Has Made Comments on Bollywood Movies
Next Story