logo
సినిమా

దగ్గుబాటి పెళ్లి వేడుకల్లో సల్మాన్ ఖాన్

దగ్గుబాటి పెళ్లి వేడుకల్లో సల్మాన్ ఖాన్
X
Highlights

దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి...

దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి పెళ్లి హైదరాబాద్ రేస్ క్లబ్ యజమాని సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ తో ఘనంగా జరుగుతోంది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమవివాహం అని టాక్. ఈ పెళ్లి జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగనుంది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుకలో ఇటు టాలీవుడ్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ నుండి కూడా టాప్ సెలబ్రిటీలు హాజరవనున్నారు. ఈ వివాహానికి విక్టరీ వెంకటేష్ స్నేహితుడు, బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ కూడా విచ్చేసారు.

ఈ వేడుకలో సల్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకీకి మాత్రమే కాక రామానాయుడు, అగ్రనిర్మాత సురేష్ బాబు తో కూడా సల్మాన్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ స్నేహంతోనే ఆశ్రిత పెళ్లి వేడుకలకు సల్మాన్ ఖాన్ ఎటెండ్ అయ్యారు. ఇక వెంకీ కుమార్తె ఆశ్రిత ప్రస్తుతం ప్రొఫెషనల్ బేకర్ గా పనిచేస్తున్నారు. తాత, తండ్రి బాటలో మనవడు వినాయక్ రెడ్డి కూడా వ్యాపార రంగాన్ని ఎంచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వినాయక్ రెడ్డి తాతగారు ఎంతో సన్నిహితుడు అని టాక్.

Next Story