రామ్ చరణ్ ను డైరెక్టర్ కోసం వెతకమని అడుగుతున్న సల్మాన్ ఖాన్

Salman Khan Asking Ram Charan to look for a Director
x

రామ్ చరణ్ ను డైరెక్టర్ కోసం వెతకమని అడుగుతున్న సల్మాన్ ఖాన్

Highlights

*రామ్ చరణ్ తో సినిమా కోసం డైరెక్టర్ ను వెతుకుతున్న సల్మాన్ ఖాన్

Tollywood: ఈమధ్య కాలంలో వరుస బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ రేంజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో స్టార్ సెలబ్రిటీలు సైతం తెలుగు డైరెక్టర్లతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రిష్, సందీప్ వంగ వంటి తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్ లో కూడా సినిమాలో తీసి తమ సత్తా చాటారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఇప్పుడు ఒక తెలుగు డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు అనే వార్త ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. మల్టీ స్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్ కి మంచి స్నేహితుడైన ఒక ప్రముఖ నిర్మాత ఇప్పటికే వీరి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేసి ఉంచారట. ఈ సినిమాకి దర్శకత్వం వహించగల ఒక మంచి డైరెక్టర్ను వెతకమని సల్మాన్ ఖాన్ ఆ బాధ్యతను రామ్ చరణ్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు శంకర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో సినిమా కోసం డైరెక్టర్ ను వెతకనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories