ప్రభాస్ సినిమా టీజర్ విడుదల అప్పుడేనా?

Salaar Movie Teaser Release in May | Telugu Movie News
x

 ప్రభాస్ సినిమా టీజర్ విడుదల అప్పుడేనా? 

Highlights

*ప్రభాస్ సినిమా టీజర్ విడుదల అప్పుడేనా?

Salaar Teaser: ఈ మధ్యనే "రాధేశ్యామ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ దశాబ్ద కాలంలో తన కరియర్ లోని మొట్టమొదటి డిజాస్టర్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "సలార్". "కే జి ఎఫ్: చాప్టర్ 2" తో తాజాగా మరొక బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

యాక్షన్ ఎంటర్టైనర్గా మాఫియా బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల గురించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ఈ చిత్ర టీజర్ లో వచ్చే నెల అనగా మే ఆఖరులో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త తో ప్రభాస్ అభమానులలో మళ్లీ ఆసక్తి మొదలైంది.

హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా ను విజయ్ కిరగండుర్ నిర్మిస్తున్నారు. రవి బశ్రుర్ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. జగపతి బాబు, ప్రిత్విరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ మరియు మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తో ప్రభాస్ మరొక బ్లాక్ బస్టర్ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories