Salaar: సైలెంట్ అయిన సలార్.. ఎక్కడా కనిపించని ప్రభాస్

Salaar Movie Had No Promotions
x

Salaar: సైలెంట్ అయిన సలార్.. ఎక్కడా కనిపించని ప్రభాస్

Highlights

Salaar: ఎక్స్‌పెక్టేషన్స్ పెంచకుండా ప్రభాస్ జాగ్రత్త పడుతున్నారా..?

Salaar: సలార్ ఎందుకు సైలెంట్ అయ్యాడు. మరో 4 రోజుల్లో సలార్ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించడం లేడు. సినిమా కోసం అసలు హడావిడే చేయడం లేదు. ఇప్పటి వరకు ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు. ఒక్క ఇంటర్యూ లేదు. సలార్‌పై ఇండియా వ్యాప్తంగా క్రేజ్ నెలకొన్నా రెబల్ స్టార్ మాత్రం ప్రమోషన్స్ విష‍యంలో ఎందుకు లైట్ తీసుకున్నాడు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడా..? లేక వ్యూహత్మకంగానే సలార్.. సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడా..?

ప్రభాస్ అంటే మినిమం ఉంటది. రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ అంతా ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడకపోయినా ప్రభాస్ సినిమాలకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. పైగా ఈసారి కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో సినిమా చేయడంతో.. సలార్‌పై ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడెప్పుడు ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్ పై చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ ప్రభాస్ మాత్రం ఆ క్రేజ్‌ను, ఆ హడావిడిని సరిగా యూజ్ చేసుకోవడంలో వెనకబడిపోయాడు. ఈనెల 22న సినిమా రిలీజ్ కాబోతుండగా అసలు ప్రమోషన్ అన్న మాటే లేదు. ట్రైలర్, సాంగ్ మినహా మరేమీ ఆప్‌డేట్ లేదు.

సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు తెగ ప్రమోషన్ చేశాడు ప్రభాస్. టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ తిరిగేశాడు. ఫలితం ఎలా ఉన్నా.. తన ప్రయత్నం మాత్రం మానలేదు. కానీ ఈసారి సలార్ సినిమాకు కాస్త డిఫరెంట్ స్ట్రాటజీనే అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వ్యూహత్మకంగానే సలార్ సినిమాపై సైలెంట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రయోషన్స్‌తో హడావిడి చేస్తే సినిమాపై ఎక్కడ లేని హైప్ క్రియేట్ అవుతుంది.

అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు ఏదేదో ఊహించుకుంటారు. అలా ఉంటుంది. ఇలా ఉంటుందని కలలు కంటారు. తీర సినిమా రిలీజ్ అయ్యి వారి హైప్‌ను అందుకోలేకపోతే నెగిటివ్ టాక్‌ వస్తుంది. ఎక్స్‌పెక్టేషన్స్ ను రీచ్ కాలేదని అభిమానులు పెదవి విరుస్తారు. అలా నెగిటివ్ మౌత్ టాక్ వచ్చిందంటే సినిమా పని అయిపోయినట్టే. అది కలెక్షన్స్ పై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో సినిమాపై అనవసర ఎక్స్ పెక్టేషన్స్ క్రియేజ్ చేయకుండా ఉండటానికే ఇలా...సలార్ సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.

ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా వచ్చి.. వైలెంట్ రిజల్ట్ ఇవ్వాలని చూస్తున్నాడట ప్రభాస్. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ పెద్దగా హల్ చల్ చేయడం లేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్‌కు ఇలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సే ఎదురుకావడంతో..ఈసారి సలార్ విషయంలో జాగ్రత్త తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఐతే ప్రభాస్ స్ట్రాటజీ ఎలా ఉన్నా అభిమానులు మాత్రం కాస్త నిరాశలోనే ఉన్నారు. అభిమాన హీరో.. పెద్దగా ప్రయోషన్స్ చేయకపోవడం వెనక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా..? సినిమా అవుట్ పుట్ పట్ల ప్రభాస్ సంతోషంగా లేడా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే సలార్ సినిమా నిర్మాణ సంస్థ హొంబలేకు, హీరో ప్రభాస్‌కు రెమ్యునరేషన్ విషయంలో తేడా వచ్చిందని.. అందుకే ప్రభాస్ అలకబూనరనే మరో టాక్ నడుస్తోంది. సలార్‌ను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నారు. ముందుగా ఒక్కటే పార్ట్ అనుకుని, ఆ తర్వాత టూ పార్ట్స్ గా రిలీజ్ చేస్తున్నారని, దానికి తగ్గట్టుగా ప్రభాస్‌కు రెమ్యూనరేషన్ ఇవ్వలేదనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories