ఇప్పటికి ఇద్దరు హీరోయిన్స్ తోనే నాగ్

ఇప్పటికి ఇద్దరు హీరోయిన్స్ తోనే నాగ్
x
Highlights

ఇప్పటికి టాలీవుడ్ కింగ్, మన్మధుడు లాగే ఉన్నాడు అక్కినేని నాగార్జున. వయసు పెరుగుతున్న కొద్ది ఇంకా హ్యాండ్సమ్ గా తయారవుతున్నాడు.

ఇప్పటికి టాలీవుడ్ కింగ్, మన్మధుడు లాగే ఉన్నాడు అక్కినేని నాగార్జున. వయసు పెరుగుతున్న కొద్ది ఇంకా హ్యాండ్సమ్ గా తయారవుతున్నాడు. ఇక నాగ్ తో ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకోని హీరోయిన్ ఉండదు కావచ్చు. ప్రస్తుతం నాగ్ వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. సైలెంట్ గా మొదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. కొన్ని యధార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో ఒక హీరోయిన్ గా దియా మిర్జాని ఎంపిక చేసింది చిత్ర బృందం..

ఇక ఇప్పుడు మరో హీరోయిన్ గా సైయామీ ఖేర్ ని ఎంపిక చేసింది. ఇందులో నాగ్ ఎన్.ఐ.ఏ. ఆఫీసరుగా కనిపిస్తుంటే సయామీ ఖేర్ 'రా' ఏజెంట్ పాత్రలో కనిపించనున్నది.నెక్స్ట్ షెడ్యుల్ లో ఆమె పాల్గొననుంది. ఆమెపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె ముంబైలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. ఈ సినిమాలో నాగ్ సరసన నటిస్తునందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. సయామీ ఖేర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన 'మిర్జియా'తో పరిచయం అయి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఉపిరి. మహర్షి లాంటి సినిమాలకి రైటర్ గా పనిచేసిన అహిషోర్ సాల్మన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు నాగ్ మరో సినిమాని కూడా లైన్ లో పెట్టాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు సినిమాని తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇందులో నాగర్జునతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పట్టలేక్కనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories