ఆ సినిమాకి సాయి పల్లవి తల్లి రెమ్యూనరేషన్ వద్దని అన్నారట

Sai Pallavis Mother who Does Not Want Remuneration | Tollywood News
x

 ఆ సినిమాకి సాయి పల్లవి తల్లి రెమ్యూనరేషన్ వద్దని అన్నారట

Highlights

* ఆ సినిమాకి సాయి పల్లవి తల్లి రెమ్యూనరేషన్ వద్దని అన్నారట

Sai Pallavi Mother: చేసినవి తక్కువ సినిమాలే అయినా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న హీరోయిన్లలో సాయిపల్లవి కూడా ఒకరు. ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే చాలామందికి నచ్చేసింది. కొందరు ఆమె నటనకి ఫ్యాన్స్ అవుతుండగా, మరికొందరు ఆమె డాన్స్ కి కూడా ఫిదా అయిపోతున్నారు. ఇక ప్రతి హిట్ సినిమా తర్వాత తన రెమ్యూనరేషన్ ను కూడా బాగానే పెంచేస్తున్న సాయిపల్లవి తాజాగా తన ఆర్థిక విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

నిజానికి సాయి పల్లవి రెమ్యూనరేషన్ మొత్తం వాళ్ళ అమ్మ అకౌంట్ లోకి వెళ్లి పోతుందట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని సాయిపల్లవి స్వయంగా చెప్పింది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఓటిపి వాళ్ళ అమ్మకి వెళ్తుందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇక తల్లిదండ్రులే తనకి చిన్నతనం నుంచి ఏం కావాలో అన్నీ అందిస్తూ వచ్చారని ఇప్పుడు తన సంపాదన తన దగ్గర కాకుండా వాళ్ళ దగ్గర ఉంటేనే తనకి సంతోషమని ఇప్పటికి కూడా ఏది కావాలన్నా మనల్ని అడుగుతుంది అనే ఒక మంచి ఫీలింగ్ వాళ్లుకు కూడా ఉండాలని అంటుంది సాయి పల్లవి.

అంతేకాకుండా శర్వానంద్ తో నటించిన "పడి పడి లేచే మనసు" సినిమా ఫ్లాప్ అవడంతో బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ వద్దని సాయి పల్లవి వాళ్ళ అమ్మగారు నిర్మాత సుధాకర్ గారితో చెప్పారని కానీ ఆయన మాత్రం ఆమె మాట వినకుండా బతిమలాడి రెమ్యూనరేషన్ కూడా క్లోజ్ చేశారు అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Show Full Article
Print Article
Next Story
More Stories