"ప్రేమ లేఖ వల్ల ఇంట్లో కొట్టారు" అంటున్న సాయి పల్లవి

Sai Pallavi Talks About the Love Letter She Wrote in Real Life
x

"ప్రేమ లేఖ వల్ల ఇంట్లో కొట్టారు" అంటున్న సాయి పల్లవి 

Highlights

"ప్రేమ లేఖ వల్ల ఇంట్లో కొట్టారు" అంటున్న సాయి పల్లవి

Sai Pallavi: స్టార్ బ్యూటీ సాయి పల్లవి ఈ మధ్యనే రానా దగ్గుబాటి హీరోగా నటించిన "విరాట పర్వం" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. అయితే సినిమాలో సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్ర హీరో రానాకి రాసిన ప్రేమలేఖని పంపడానికి చాలా ఇబ్బందులు పడుతుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నిజజీవితంలో రాసిన ప్రేమలేఖల గురించి చెప్పుకొచ్చారు రానా మరియు సాయి పల్లవి. స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని చాలా ఇష్టపడిన సాయి పల్లవి ఆ అబ్బాయికి లవ్ లెటర్ రాసి ఇంట్లో దొరికిపోయిందట. "అప్పుడు నేను ఏడవ తరగతి అనుకుంటాను. స్కూల్ లో ఒక అబ్బాయి నాకు బాగా నచ్చడంతో ఎలాగైనా చెప్పాలి అని నేను ప్రేమలేఖ రాశాను.

కానీ మా ఇంట్లో దొరికిపోయాను. మా అమ్మ నాన్న అప్పుడు నన్ను బాగా కొట్టారు. ఆ తర్వాత ఎప్పుడూ నేను ప్రేమలేఖలు రాయలేదు," అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇక ఇదే విషయంపై రానా మాట్లాడుతూ తాను తన చిన్నప్పుడు కరంచేడు లో ఉన్న వాళ్ళ తాతగారికి ఒక లేఖ రాశానని ఆ తర్వాత ఇంకెప్పుడూ లెటర్స్ రాయలేదని అన్నారు రానా. ఇక మరోవైపు సాయి పల్లవి "గార్గి" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories