నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న సాయి పల్లవి

Sai Pallavi Says that She Will also Producer | Tollywood News
x

నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న సాయి పల్లవి 

Highlights

నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న సాయి పల్లవి

Sai Pallavi: "ఫిదా" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన సాయి పల్లవి కరియర్లో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ మధ్యనే "విరాటపర్వం" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సాయి పల్లవి మంచి విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ సినిమాలో తన అద్భుతమైన అన్నతో అందరి మనసులను దోచుకుంది. అయితే తాజాగా ఇప్పుడు తనకు నిర్మాణ రంగం వైపు కూడా ఆసక్తి ఉన్నట్లుగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది ఈ భామ.

సాయి పల్లవి నటించినా "గార్గి" సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది.ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సాయి పల్లవి ఈ మధ్యనే సూర్య మరియు జ్యోతికాలకు సినిమాని చూపించింది. ఇక సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయినా సూర్య తానే సమర్పకుడిగా వ్యవహరిస్తానని మాట ఇచ్చారు. ఈ సినిమా తమిళంలో సూర్యా పేరు మీద విడుదల కాబోతోంది.

తెలుగులో ఈ సినిమాని రానా సమర్పిస్తున్నారు. "సమర్పకురాలిగా నా పేరు వేస్తామని నిర్మాతలు అన్నారు. కానీ నా సినిమా నేనే సమర్పించుకోవడం ఏంటని వద్దని అన్నాను. ఎప్పుడైనా నా దగ్గరికి ఒక మంచి కథ వచ్చి సినిమాని నేనే నిర్మించాలని బలంగా అనిపిస్తే తప్పకుండా పూర్తిస్థాయి నిర్మాతగా కూడా వ్యవహరిస్తాను. ఈ పరిశ్రమ నాకు చాలా ఇచ్చింది. అందుకే ఏదో ఒక రూపంలో తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాను," అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Show Full Article
Print Article
Next Story
More Stories