"ఆ ట్యాగ్ నచ్చలేదు" అంటున్న సాయి పల్లవి

Sai Pallavi Say I Do Not Like That Tag | Tollywood News
x

"ఆ ట్యాగ్ నచ్చలేదు" అంటున్న సాయి పల్లవి

Highlights

*"ఆ ట్యాగ్ నచ్చలేదు" అంటున్న సాయి పల్లవి

Sai Pallavi: చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో సాయి పల్లవి పేరు ముందే ఉంటుంది. "ఫిదా" సినిమా తో ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ భామ కొద్దిరోజుల్లోనే తన సూపర్ హిట్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఇప్పుడు ఈమెకు అభిమానులు లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా ఇచ్చేశారు. మొదట్లో ఒక ఈవెంట్లో సాయి పల్లవి మైక్ తీసుకోగానే అభిమానులందరూ లేడీ పవర్స్టార్ అని అరవడం మొదలు పెట్టారు.

కానీ సాయి పల్లవి మాత్రం వాటిని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఒక ఈవెంట్ లో ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవి ను సంబోధిస్తూ లేడీ పవర్ స్టార్ అని అనడం నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ట్యాగ్ గురించి అడగగా సాయి పల్లవి అలాంటి ట్యాగ్స్ కి తను అంతగా కనెక్ట్ అవ్వను అని చెప్పుకొచ్చింది.

తన మీద అభిమానులు చూపిస్తున్న ప్రేమకు తనకి చాలా సంతోషంగా ఉందని కానీ ఇలాంటి ట్యాగ్స్ తీసుకోవటంవల్ల తన మీద ప్రెజర్ పెరిగి అది పర్ఫామెన్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందని అందుకే అలాంటి ట్యాగ్స్ ని తన సీరియస్గా తీసుకోనని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇక సాయి పల్లవి మరియు రానా నటించిన "విరాటపర్వం" ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీసు వద్ద పర్వాలేదు అనిపిస్తోంది. మరోవైపు సాయి పల్లవి తమిళ్ లో "గార్గి" అనే సినిమా తో బిజీగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories