ఫ్లాప్ సినిమాకి రెమ్యూనరేషన్ వద్దన్న హీరోయిన్

Sai Pallavi
x
Sai Pallavi
Highlights

'ఫిదా' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన సాయి పల్లవి గురించి చాలా పుకార్లు బయటకు వచ్చాయి. కో స్టార్స్ తో చాలా అహంకారం గా ప్రవర్తిస్తుందని, సెట్స్ కి అసలు సమయానికి రాదని బోలెడు వార్తలు వింటూనే ఉన్నాం.

'ఫిదా' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన సాయి పల్లవి గురించి చాలా పుకార్లు బయటకు వచ్చాయి. కో స్టార్స్ తో చాలా అహంకారం గా ప్రవర్తిస్తుందని, సెట్స్ కి అసలు సమయానికి రాదని బోలెడు వార్తలు వింటూనే ఉన్నాం. కానీ ఈ మధ్యనే విడుదలై డిజాస్టర్ గా మారిన 'పడి పడి లేచే మనసు' సినిమా నిర్మాతతో ఈమె ప్రవర్తన అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ మధ్యనే హీరో శర్వానంద్ మరియు సాయి పల్లవి, హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు' అనే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా విడుదలైన తర్వాత సాయి పల్లవి తన మిగతా రెమ్యూనరేషన్ తీసుకోవాల్సి ఉంది. కానీ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అందుకని సాయి పల్లవి బాకీ ఉన్న పారితోషకం వద్దని చెప్పిందట. అది మరీ చిన్న అమౌంట్ కాదండోయ్. అక్షరాలా 40 లక్షలు. హీరోయిన్ తీసుకోలేదని సాయి పల్లవి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ డబ్బును ఇద్దామని ప్రయత్నించారు ప్రొడ్యూసర్లు కానీ వాళ్లు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఇప్పటివరకు సినిమా ఫ్లాప్ అయితే హీరోలు లేదా దర్శకులు రెమ్యునరేషన్ తిరిగి చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ సాయి పల్లవి ఈ పని చేసి అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఈమె పై ఉన్న అన్ని పుకార్లు ఈ ఒక్క మంచి పని తో తుడిచిపెట్టుకుపోయాయి అంటే అతిశయోక్తి కాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories