Sai Pallavi: గ్లామర్‌కి దూరంగా ఉన్నా.. అవకాశాలకు కొదవలేదు

Sai Pallavi: గ్లామర్‌కి దూరంగా ఉన్నా.. అవకాశాలకు కొదవలేదు
x

గ్లామర్‌కి దూరంగా ఉన్నా.. అవకాశాలకు కొదవలేదు

Highlights

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. కొంతమంది హీరోయిన్స్ మొదట్లో నార్మల్‌గానే ఉన్నప్పటికీ, క్రేజ్ వచ్చిన తర్వాత వారి తీరు మారిపోతోంది. గ్లామర్ పాత్రలకు సైన్ చేయడానికి వారు వెనుకాడటం లేదు.

Sai Pallavi: సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. కొంతమంది హీరోయిన్స్ మొదట్లో నార్మల్‌గానే ఉన్నప్పటికీ, క్రేజ్ వచ్చిన తర్వాత వారి తీరు మారిపోతోంది. గ్లామర్ పాత్రలకు సైన్ చేయడానికి వారు వెనుకాడటం లేదు. కానీ తాను మాత్రం అలాంటి పాత్రలు చేయనంటోంది ఒక హీరోయిన్. క్రేజ్ వచ్చినా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటోంది. అయినప్పటికీ కెరీర్‌పరంగా ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. గ్లామర్ జోలికి వెళ్లననే కమిట్‌మెంట్‌తో పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోలతో నటించే అవకాశం మిస్ అయినా పర్వాలేదు అంటోంది. ఆ హీరోయిన్‌ ఇంకెవరో కాదు.. సాయి పల్లవినే. ఇంతకీ జనాలు ఇంప్రెస్ అయింది సాయిపల్లవి యాక్టింగ్‌‌కా? లేక ఆమె కమిట్మెంట్‌కా?

ఇండస్ట్రీలో గ్లామర్ ముఖ్యం.. కానీ ఒక్కోసారి వారి నటనకు ఫిదా అయిపోతారు అభిమానులు. అలాంటి వారిలో సాయిపల్లవి ఒకరు. సహాజ సౌందర్యం, నటన, డ్యాన్స్‌తో అందరినీ కట్టిపడేస్తుంటారు. తన మాట, చలాకీ తనంతో సినిమా బోర్ కొట్టకుండా చివరి నిమిషం వరకు సీట్లల్లో కూర్చుండిపోయేలా చేస్తారు. అందుకే సాయి పల్లవి సినిమా అంటే.. ఆమె అభిమానులు ఆ సినిమాలో హీరో ఎవరన్నది చూడరు. సాయి పల్లవి ఆమె అభిమానులకు అంతగా క్లోజ్ అయ్యారు.

సాయిపల్లవి గ్లామర్ క్యారెక్టర్స్ చెయ్యకపోయినా.. మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ అనడంలో ఏ మాత్రం సందేహంలేదు. గ్లామర్ పాత్రలు చేయకపోయినా.., ఎంత పెద్ద హీరో అయినా స్టోరీ బాగుంటేనే తప్ప లేకపోతే ఓకే చెప్పని సాయిపల్లవికే ఆడియెన్స్ కనెక్ట్ అయిపోయారు. అంతేకాదు సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో హీరో పాత్రను ఓవర్ టేక్ చేస్తూ ఆడియన్స్‌ను మెప్పించడంలో సాయిపల్లవి మంచి మార్కులే కొట్టేశారు.

సాయిపల్లవి సింపుల్‌గా ఉంటుంది కాబట్టే.. అన్ని రకాల ఆడియన్స్‌‌ను ఆకట్టుకోగలిగారు. తన యాక్టింగ్, డ్యాన్స్‌తో అందర్నీ ఇంప్రెస్ చేసేశారు. అందుకే ఆమెకు అవకాశాలకు కొదవలేదు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఆమెకు క్యారెక్టర్ నచ్చకపోతే సినిమాలు చేయరు. గ్లామర్ పాత్రలు అసలే చేయరు.. ఆమెను ఆ పాత్రలు చేయమని కూడా ఎవరూ అడగరు. ఒకవేళ ఎవరైనా అడిగినా ఆమె నిర్మోహమాటంగా నో చెప్పేస్తారు.

స్టార్‌డమ్, ఇమేజ్ వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ మారిపోతుంటారు. మొదట్లో గ్లామర్‌కి నో చెప్పినప్పటికీ... ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో మళ్లీ గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పిన వారు చాలా మందే ఉన్నారు. కానీ సాయి పల్లవి మాత్రం తాను అలా చేయనంటూ మొహమాటం లేకుండా చెబుతోంది. బాలీవుడ్‌లో గ్లామర్ రోల్స్ ఎక్కువ. కానీ అలాంటి బాలీవుడ్‌ను సైతం తన సింప్లిసిటీతో మెప్పించేసింది. అందుకే అక్కడ ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. రామాయణం కోసం సీతగా సాయిపల్లవినే ఓకే చేశారు.

అసలు సాయి పల్లవి సినిమాలో ఉందంటే.. జనాల చూపు అంతా ఆమె పైకే వెళ్లిపోతుంది. ఫిబ్రవరి 7న తండేల్ సినిమాతో సాయిపల్లవి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోనూ నాగ చైతన్యతో పాటు సాయిపల్లవికి కూడా మంచి గుర్తింపునిచ్చే పాత్ర దక్కినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరి తండేల్ సినిమాకి సాయిపల్లవి మ్యాజిక్ ఏ రేంజ్‌లో వర్కవుట్ అవుతుందో చూడాలి. అన్నట్లు ఈ ఇద్దరూ కలిసి నటించడం ఇది రెండోసారి. 2021 లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లవ్ స్టోరీ మూవీ కూడా మంచి హిట్ అయింది. తండేల్ మూవీ కూడా అలాగే హిట్ అవుతుందని సాయి పల్లవి ఫ్యాన్స్ భావిస్తున్నారు. దటీజ్ సాయి పల్లవిస్ క్రేజ్.

Show Full Article
Print Article
Next Story
More Stories