పవన్ కళ్యాణ్ కోసం తన సినిమాకి బ్రేకులు వేసిన సాయి తేజ్

Sai Dharam Tej Stopped His Film Shoot For Pawan Kalyan
x

పవన్ కళ్యాణ్ కోసం తన సినిమాకి బ్రేకులు వేసిన సాయి తేజ్

Highlights

పవన్ కళ్యాణ్ కోసం తన సినిమాకి బ్రేకులు వేసిన సాయి తేజ్

Sai Dharam Tej: బైక్ ఆక్సిడెంట్ తర్వాత చాలా కాలం సినిమాలకి దూరంగా ఉన్నా మెగా మేనల్లుడు సాయి తేజ్ తాజాగా ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారు. ప్రస్తుతం "ఛత్రపతి" నిర్మాతల తో కలిసి ఒక సినిమాని ఒప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా సెట్స్ పైకి వెళ్ళింది సాయి తేజ్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కి ఇప్పుడు బ్రేక్ పడబోతోందట. దానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే, సాయి తేజ్ మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఒక మెగా మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన "వినొదయ సితం" అనే సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనుండగా సాయి తేజ్ మనిషి పాత్రలో కనిపించనున్నారు.

అయితే రాజకీయపనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక షెడ్యూల్ కి 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందుకే సాయి తేజ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ప్రస్తుతం తాను చేస్తున్న చిత్ర నిర్మాతలను సంప్రదించి విషయాన్ని తెలిసి ఈ సినిమా నుంచి 20 రోజుల బ్రేక్ తీసుకున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories