Top
logo

మెగా హీరోతో దర్శకుడు మారుతి

మెగా హీరోతో దర్శకుడు మారుతి
Highlights

వరుసగా రెండేళ్లలో ఆరు డిజాస్టర్లు అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు ఎట్టకేలకు 'చిత్రలహరి' సినిమాతో...

వరుసగా రెండేళ్లలో ఆరు డిజాస్టర్లు అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు ఎట్టకేలకు 'చిత్రలహరి' సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఏప్రిల్ 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే వసూలు చేసింది. నిజానికి సాయి ధరమ్ తేజ్ కి పాతిక కోట్ల దాకా మార్కెట్ ఉంది కానీ ఆ రేంజిలో 'చిత్రలహరి' సినిమా రైట్స్ అమ్మీ ఉంటే ఇప్పటికీ బోల్డంత నష్టం కలిగి ఉండేది. కానీ అలా చేయకుండా సగం ధరలకే అమ్మడంతో దాదాపు అందరూ బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వచ్చేసారు. ఇక ఈ సినిమా కోసం న్యూమరాలజీ ప్రకారం సాయిధరమ్తేజ్ తన పేరును సాయి తేజ గా మార్చుకున్నాడు.

ఇక 'చిత్రలహరి' సినిమా తర్వాత తాజాగా సాయి తేజ్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. మాస్ మసాలా అంశాలు ఏమీ లేకుండా 'చిత్రలహరి' సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుందని, అలాంటి కథనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 'శైలజ రెడ్డి అల్లుడు' సినిమాతో డిజాస్టర్ అందుకున్న మారుతి మళ్లీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి. ఇక నిర్మాతగా కూడా వ్యవహరించిన మారుతి విజయాలని అందుకోలేకపోయాడు. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకున్నాడు.

Next Story

లైవ్ టీవి


Share it