Top
logo

'గల్లీ బాయ్' తెలుగు రీమేక్ గురించి క్లారిటీ ఇచ్చిన మెగా మేనల్లుడు

X
Highlights

రణ్వీర్ సింగ్, అలియా భట్ ముఖ్య పాత్రల్లో కనిపించిన 'గల్లీ బాయ్' సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి...

రణ్వీర్ సింగ్, అలియా భట్ ముఖ్య పాత్రల్లో కనిపించిన 'గల్లీ బాయ్' సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది గీత ఆర్ట్స్. తెలుగు రీమేక్ లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నట్టు పుకార్లు బయటకి వచ్చాయి. తాజాగా 'చిత్రలహరి' సినిమా ప్రమోషన్స్ చేస్తున్న సాయి ధరంతేజ్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. 'గల్లీ బాయ్' తెలుగు రీమేక్ మీరే చేస్తున్నారా అని అడుగగా అసలు ఇంతవరకు తాను 'గల్లీ బాయ్' చూడలేదు అని చెప్పి సాయి ధరంతేజ్ షాకిచ్చారు.

అంతేకాక ఈ పుకార్లలో నిజం లేదని, 'గల్లీ బాయ్' రీమేక్ తాను చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం 'చిత్రలహరి' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు తేజ్. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. వరుసగా ఆరు డిజాస్టర్లు అందుకున్న మెగా మేనల్లుడు ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

Next Story