logo

'సాహో' లో కామెడి కి కొదవ లేదట

prabhasprabhas
Highlights

బాహుబలి సినిమాతో ప్రభాస్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో నే కాక ప్రపంచమంతటా పాపులర్ అయిపోయాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ రాబోయే చిత్రం కోసం ప్రపంచం మొత్తం లో ప్రభాస్ ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాహుబలి సినిమాతో ప్రభాస్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో నే కాక ప్రపంచమంతటా పాపులర్ అయిపోయాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ రాబోయే చిత్రం కోసం ప్రపంచం మొత్తం లో ప్రభాస్ ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మల్టీ కొర్ యాక్షన్ డ్రామా గా భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న 'సాహో' సినిమా కు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి అని తెలిసిందే. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమా కోసం ఫైట్ సీన్ లు కొరియోగ్రఫీ చేశారు. ఈ మధ్యనే 'షేడ్స్ ఆఫ్ సాహో' అనే పేరుతో విడుదలైన మేకింగ్ వీడియో కూడా ఈ సినిమాలో కొన్ని అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని చెప్పకనే చెప్పింది.

ఇక అప్పటి నుండి ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ అని ప్రచారం సాగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాక కామెడీ కి రొమాన్స్ కి ఏమాత్రం కొదవ ఉండదని తెలుస్తోంది. ఈ సినిమాలో వచ్చే సిట్యుయేషనల్ కామెడీ కచ్చితంగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది అని టాక్ నడుస్తోంది. అలాగే కేవలం యాక్షన్ థ్రిల్లర్ గానే కాక ఒక కమర్షియల్ ఎంటర్టైనర్గా కూడా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన 'సాహో' సినిమా ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది.

లైవ్ టీవి

Share it
Top