రాజమౌళి సెంటిమెంట్ నుంచి ప్రభాస్ కూడా తప్పించుకోలేకపోయాడు!

రాజమౌళి సెంటిమెంట్ నుంచి ప్రభాస్ కూడా తప్పించుకోలేకపోయాడు!
x
Highlights

తెలుగు సినిమాల్లో సెంటిమెంట్స్ ఎక్కువ ..అది హీరోల నుండి దర్శక నిర్మాతల వరకు ఎవరికైనా కావచ్చు . ఒక్కసారి సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఇక అన్ని సినిమాలకు...

తెలుగు సినిమాల్లో సెంటిమెంట్స్ ఎక్కువ ..అది హీరోల నుండి దర్శక నిర్మాతల వరకు ఎవరికైనా కావచ్చు . ఒక్కసారి సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఇక అన్ని సినిమాలకు అదే సెంటిమెంట్స్ ని రీపీట్ చేసుకుంటూ వెళ్తారు... ఉదాహరణకి సినిమా స్క్రిప్ట్ ని ముందుగా తిరుమల శ్రీవారి దగ్గరికి వెళ్లి పూజలు చేయడం నిర్మాత దిల్ రాజుకి ఓ సెంటిమెంట్ .. ఇక సినిమా ప్రారంబోత్సవానికి రాకపోవడం హీరో మహేష్ బాబుకి ఓ సెంటిమెంట్ .. ఇక సినిమా పేరులో చివర సున్నా ఉండేలా చూసుకోవడం హీరో గోపీచంద్ సెంటిమెంట్ .. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సెంటిమెంట్ తో ముందుకు వెళ్తుంటారు ...

ఇక టాలీవుడ్ లో ఇవే కాకుండా మరో సెంటిమెంట్ ఉంది . అదేంటంటే దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేసాక అ హీరో నెక్స్ట్ ఏ సినిమా చేసినా అ సినిమా అనుకున్న స్థాయిలో నిలబడలేదు. ఎన్టీఆర్ తో ముందుగా రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా చేసాడు. అ సినిమా మంచి విజయాన్ని అందుకుంది . అ తర్వాత ఎన్టీఆర్ రుద్రరాజు సురేష్ వర్మ దర్శకత్వంలో సుబ్బు అనే సినిమాని తీసాడు . అ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. అదే పరిస్థితి ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చింది.

రాజమౌళి దర్శకత్వంలో హీరోయిజం పీక్స్ లో వెళ్ళిపోతుంది. ఆ హీరో పై.. అయన సినిమాలపై విపరీతమైన అంచనాలు వచ్చేస్తాయి. దీంతో తరువాత వచ్చిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలం అవడం సహజంగా జరిగిపోతుంది. ఇది దాదాపుగా రాజమౌళి సినిమాలు అన్నిటికీ జరిగింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరో తొ సినిమా చేసిన దర్శకుడికీ తిప్పలు తప్పవు. ఎప్పుడైతే పెద్ద హిట్ తొ హైప్ లో ఉన్న హీరోతో చేస్తారో.. ఆ సినిమా కొద్దిగా అటూ ఇటూ అయినా పరిస్థతి ఇబ్బందికరంగా అవుతుంది. హీరోలు ఈ ఇబ్బంది నుంచి ఆ తరువాతి సినిమాలోనే కోలుకోగలరు కానీ.. దర్శకులు మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఈ క్రింది వివరాలు చూస్తె మీకే ఈ విషయం అర్థం అవుతుంది. .







Show Full Article
Print Article
More On
Next Story
More Stories