Sagar K Chandra: పవన్ కళ్యాణ్ తో పని చేయడం చాలా ఈజీ అంటున్నా సాగర్ కే చంద్ర

Sagar K Chandra Says it is Very Easy to Work With Pawan Kalyan
x

పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయడం చాల ఈజీ అంటున్న సాగర్ కే చంద్ర (ఫైల్ ఇమేజ్)

Highlights

Sagar K Chandra: మా ఇద్దరికీ గన్నులు అంటే ఇష్టం అంటున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్

Sagar K Chandra: "అయ్యారే" సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కే చంద్ర "అప్పట్లో ఒకడుండేవాడు" సినిమాతో పర్వాలేదు అనిపించారు. కానీ ఇప్పుడు మూడవ సినిమా కి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి దర్శకత్వం వహించడానికి సిద్ధమైన సాగర్ కే చంద్ర అందరికీ షాక్ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందిస్తున్న భీమ్లా నాయక్ సినిమా లో పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోలుగా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనం కోషీయుం'" సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా పవన్ కళ్యాణ్ తో ఆయన అనుబందం గురించి ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.

"ముందుగా ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం నాకు వచ్చినప్పుడు కేవలం రానా దగ్గుబాటి మాత్రమే ఈ సినిమాలో నటిస్తున్నట్లు నాకు తెలిసింది. త్రివిక్రమ్ గారు చెప్పే వరకు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం నాకు తెలీదు. మలయాళంలో బిజు మీనన్ తో పోల్చుకుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ పెద్ద స్టార్. కానీ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు స్టార్ హీరో కంటే ఇంకా ఎక్కువ. కానీ ఆ బ్యాలెన్స్ ని మేము బాగానే మేనేజ్ చేసాము. పవన్ కళ్యాణ్ గారి తో తరచుగా ఇంటరాక్ట్ అవుతూ మేము బాగా క్లోజ్ అయ్యాము. మా ఇద్దరి మధ్య నడిచే టాపిక్ ఎక్కువగా గన్స్ గురించి ఉంటుంది. మా ఇద్దరికీ గన్స్ అంటే చాలా ఇష్టం. దానివల్లే మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాము. ఆయన చాలా వెల్కమింగ్ వ్యక్తి. ఆయనతో పని చేయడం చాలా ఈజీ" అని చెప్పుకొచ్చారు సాగర్ కి చంద్ర.

Show Full Article
Print Article
Next Story
More Stories