బాలయ్య సరసన ఆర్ఎక్స్ 100 భామ?

బాలయ్య సరసన ఆర్ఎక్స్ 100 భామ?
x
Balakrishna New Movie
Highlights

ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ కొట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.. ఆ తర్వాత చేసిన ఆర్ డి ఎక్స్ 100 ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ కొట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.. ఆ తర్వాత చేసిన ఆర్ డి ఎక్స్ 100 ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది.ఇక సీనియర్ హీరో వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా రవితేజతో డిస్కో రాజా మెరిసింది. మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్ పుత్ కి ఇప్పుడు ఓ బంపరాఫర్ వచ్చినట్లు సమాచారం..

సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్లు ఎవరనేది గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతో ఒక హీరోయిన్ గా అంజలిని ఇప్పటికే ఎంపిక చేసిన చిత్ర బృందం. ఇక మరో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో పాయల్ రాజ్ పుత్ బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో అతిధి పాత్ర పోషించింది.

దీనితో పాయల్ రాజ్ పుత్ కి ఈ సినిమాలో అవకాశం దక్కినట్టు వస్తుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ "5డబ్ల్యూ ఎస్" అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో పాయల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.

ఇక బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ నీ పూర్తి చేసుకున్న సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. సింహా, లెజెండ్ తరహాలోనే ఇందులో కూడా బాలకృష్ణ రెండో తరహా పాత్రలు పోషించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాని ద్వారక ప్రొడక్షన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories