'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర ఇదే

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర ఇదే
x
Highlights

'బాహుబలి' సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తదుపరి సినిమా అని మాత్రమే కాక టాలీవుడ్ లోనే అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కనున్నందువల్ల...

'బాహుబలి' సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తదుపరి సినిమా అని మాత్రమే కాక టాలీవుడ్ లోనే అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కనున్నందువల్ల 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మొట్టమొదటి సినిమా గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి ఇప్పటికే చాలా పుకార్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. తాజాగా జరిగిన ప్రెస్మీట్లో సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా అలియా భట్ నటిస్తుండగా డైసీ ఎడ్గార్ జోన్స్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనుంది.

అంతేకాక బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారని రాజమౌళి చెప్పారు. కానీ ఆ పాత్ర గురించి వివరాలు ఏమి చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక నార్త్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో అజయ్ దేవగన్ కనిపించనున్నారని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ విషయమై రాజమౌళి అండ్ టీం నుంచి ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ లో అలియా కూడా జాయిన్ అవ్వనుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories