Samantha: సమంత ఆరోగ్య పరిస్థితి గురించి మళ్లీ మొదలైన పుకార్లు

Rumors About Samantha Health Condition
x

Samantha: సమంత ఆరోగ్య పరిస్థితి గురించి మళ్లీ మొదలైన పుకార్లు

Highlights

Samantha: అమెజాన్ వారు సమంత పేరు మర్చిపోయారా?

Samantha: గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఆరోగ్య పరిస్థితి గురించి ఎన్నో పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సమంత ఆరోగ్యం ఇప్పుడు బాగానే కుదుటపడిందని ఈమె త్వరలోనే తన తదుపరి సినిమా "ఖుషీ" షూటింగ్ ని జనవరి మూడవ వారం నుంచి తిరిగి మొదలు పెట్టబోతోందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఇండియా వారు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సమంత అభిమానులను కంగారు పడేలాగా చేస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన సమంత తొమ్మిది నెలలకి ఒక ప్రాజెక్ట్ సైన్ చేసిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కి "సిటాడెల్" అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కాబోతోంది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు వరుణ్ ధావన్ కి సంబంధించిన ఒక లుక్ ని విడుదల చేశారు. అంతేకాకుండా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్ పైకి వెళుతుందని ఆ ట్వీట్ ద్వారా తెలియజేశారు.

అయితే ఈ పోస్ట్ కి వరుణ్ ధావన్ తో పాటు సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్న రాజ్ డీకే మరియు ఇతర సాంకేతిక వర్గానికి సంబంధించిన వారిని కూడా ట్యాగ్ చేశారు కానీ ఇందులో సమంతా పేరు మాత్రం లేదు. దీంతో అసలు సమంతా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతోందా లేదా అని అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ సమంత ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి సమంత ఈ పుకార్లకు చెక్ పెట్టి అభిమానులకు ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories