వారణాసిలో ఆర్ఆర్ఆర్ టీమ్ పవిత్ర గంగానదికి ప్రత్యేక పూజలు...

వారణాసిలో ఆర్ఆర్ఆర్ టీమ్ పవిత్ర గంగానదికి ప్రత్యేక పూజలు...
x

వారణాసిలో ఆర్ఆర్ఆర్ టీమ్ పవిత్ర గంగానదికి ప్రత్యేక పూజలు...

Highlights

RRR Team - Varanasi: సంప్రదాయ దుస్తులు ధరించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి...

RRR Team - Varanasi: టాలీవుడ్‌తో పాటు వరల్డ్‌ వైడ్‌ సినీఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్‌ బ్యూటీ ఒలివియా మోరీస్‌, శ్రియాశరణ్‌, అజయ్‌దేవ్‌గణ్‌, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్‌ కానుంది.

దీంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతోంది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. మంగళవారం వారణాసిలో సంప్రదాయ దుస్తులు ధరించిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పవిత్ర గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. మెడలో రుద్రాక్ష, నుదుటున బొట్టు ధరించి పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories