Top
logo

RRR అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. సినిమా రిలీజ్ ఈ ఏడాది కాదు

RRR అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. సినిమా రిలీజ్ ఈ ఏడాది కాదు
X
Highlights

దర్శకధీరుడు రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. RRR వాయిదా పడుతున్నట్టు బాలీవుడ్ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ పరోక్షంగా తెలిపిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్నట్లుగానే రాజమౌళి అభిమానులకు షాక్ ఇచ్చారు. సినిమా విడుదల తేదీని 2021 జనవరి 08 వాయిదా వేశారు. ఈ మేరకు ఆర్.ఆర్.ఆర్ అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు.

మీ ప్రేమ అభిమానాన్ని మేం అర్థం చేసుకోగలం, నిరంతరాయంగా సినిమా షూటింగ్ చేస్తున్నాం. మేము ఎంతో కష్టపడుతున్నాం. ఎన్నడూ లేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి పనిచేస్తున్నామని మీ నిరుత్సాహాన్ని అర్థం చేసుకోగలం. మంచి సినిమాను అందించడానికి సమయం కావాలి అని RRR వాయిదా చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాని జూలై 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కాగా.. జవవరి 08- 2021కి వాయిదా వేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Web TitleRRR movie will hit the screens on 2021 january
Next Story