'ఆర్ ఆర్ ఆర్' ల ఓటు ఎవరికి'

ఆర్ ఆర్ ఆర్ ల ఓటు ఎవరికి
x
Highlights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్-చరణ్ మరియు రాజమౌళి వేరే వేరే పార్టీల బాక్గ్రౌండ్ నుండి రావడం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా సినిమాల మీద మాత్రమే తన దృష్టిని పెట్టిన ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయాడు. అతని సోదరి టీడీపీ టికెట్ పై కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ టీడీపీ కి కోసం ఎన్టీఆర్ క్యాంపెయిన్ ల లో పాల్గొనలేదు.

మరోవైపు బాబాయిలు పవన్ కళ్యాణ్, నాగబాబు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే మరియు ఎంపీ గా బరిలోకి దిగనున్నారు. అయినప్పటికీ మెగా కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచార లకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు రాజమౌళి ఎప్పుడో లోక్సత్తా పార్టీకి తన మద్దతు తెలిపారు కానీ ఇప్పుడు ఆ పార్టీ అసలు ఎలక్షన్స్ లో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు స్టార్ లు 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ ఓటు వేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈ ముగ్గురికి తెలంగాణలొనే ఓటు హక్కు ఉంది. పైగా తెలంగాణాలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వీరు తమ ఓటు వేశారు. మరి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో వీరు ఓటు వేస్తారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories