తెలుగు చిత్ర ఇండస్ట్రీలో కొత్త రికార్డును సృష్టించిన "అర్ ఆర్ ఆర్"

RRR Movie Sets New Record in Telugu Film Industry
x

తెలుగు చిత్ర ఇండస్ట్రీలో కొత్త రికార్డును సృష్టించిన "అర్ ఆర్ ఆర్"

Highlights

*తెలుగు చిత్ర ఇండస్ట్రీలో కొత్త రికార్డును సృష్టించిన "అర్ ఆర్ ఆర్"

RRR Movie: "బాహుబలి2" తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా "ఆర్ఆర్అర్". మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ప్యాన్ ఇండియన్ మల్టీస్టారర్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు నుంచే బ్లాక్బస్టర్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డు పెట్టిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర కలెక్షన్లు ఒక కొత్త రికార్డును సృష్టించాయి. కరోనా తర్వాత వంద కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ ని వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా "అర్ఆర్ఆర్" తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో నిలిచిపోతుంది.

సినిమా విడుదలైన 12 రోజుల్లోనే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ చిత్రం 101.27 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల షేర్ ను వసూలు చేసింది. అందులో సింహభాగం నైజాం ఏరియా నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక రాజమౌళి తన ప్రతి ఒక్క సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పది రెట్లు పెంచుతో వెళుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories