'రామ రౌద్ర రుషితం' అంతా ఫేక్ ...

రామ రౌద్ర రుషితం అంతా ఫేక్ ...
x
Highlights

దసరా పండగకి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడమే కాదు. కొత్త కొత్త సినిమాలకి సంబంధించిన అప్డేట్లు కూడా వస్తూ ఉంటాయి... అందులో భాగంగానే ఈ ఏడాది...

దసరా పండగకి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడమే కాదు. కొత్త కొత్త సినిమాలకి సంబంధించిన అప్డేట్లు కూడా వస్తూ ఉంటాయి... అందులో భాగంగానే ఈ ఏడాది కొత్త కొత్త సినిమాలకి సంబంధించిన అప్డేట్లు వచ్చాయి ... ఈ నేపధ్యంలో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వీపరితంగా వైరల్ అయ్యింది..

ఈ సినిమాకి "రామ రౌద్ర రుషితం" అనే టైటిల్ పెట్టినట్టుగా ఓ పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసారు. దసరా పండగ కావడంతో ఇదే సినిమా టైటిల్ అని ఫిక్స్ అయిపోయి ఫాన్స్ లైక్లు, షేర్లు కొట్టేశారు. కేవలం ఫాన్స్ మాత్రమే కాదు. పీఆర్ టీమ్ సభ్యులు షేర్ చేయడంతో ఇది వీపరితంగా వైరల్ అయింది. అయితే ఇది కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తేలిపోయింది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ఇంకా ఎలాంటి టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఆర్.ఆర్.ఆర్ అని వర్కింగ్ టైటిల్ గా పెట్టేశారు అంతే . తాజా పోస్టర్ కు సంబంధించి అఫీషియల్ గా చిత్ర యూనిట్ నుండి కూడాఎలాంటి ప్రకటన లేదు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని వచ్చే ఏడాది జూలై ముప్పైన విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories