RRR Movie Update: 'ఆర్ఆర్ఆర్' ను వాయిదా వేయనున్న రాజమౌళి?

RRR Movie Likely to be Released on Republic Day 26th January 2022
x

ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

RRR Movie Update: తెలుగు ప్రేక్షకులు మాత్రమేకాక రాజమౌళి అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్" (RRR). రామ్ చరణ్, ఎన్టీఆర్...

RRR Movie Update: తెలుగు ప్రేక్షకులు మాత్రమేకాక రాజమౌళి అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్" (RRR). రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. జూలైలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. అక్టోబర్ 13న విడుదల కాబోతుంది అనే విషయాన్ని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే విషయంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. చిత్ర బృందం చిన్న పోస్టర్ విడుదల చేసినా సరే పోస్టర్ కంటే ముందు అభిమానులు విడుదల తేదీని చూస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదలను వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 13 అంటే ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది. ఈ రెండు నెలల్లో మిగిలిన షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రమోషన్ పనులు జరగటం అసాధ్యమని అందుకే దర్శకుడు రాజమౌళి మరియు నిర్మాతలు సినిమాని వాయిదా వేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దసరా మరియు సంక్రాంతి సీజన్లో ఖాళీ లేకపోవడంతో "ఆర్ఆర్ఆర్" సినిమాను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories