Top
logo

కేవలం హీరోల ఇంట్రో సీన్ ల కోసం భారీ బడ్జెట్ వెచ్చిస్తున్న 'ఆర్ఆర్ఆర్' బృందం

కేవలం హీరోల ఇంట్రో సీన్ ల కోసం భారీ బడ్జెట్ వెచ్చిస్తున్న
Highlights

'ఆర్ఆర్ఆర్' షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ లోనే రామ్ చరణ్ ఇంట్రో సీన్ పూర్తి...

'ఆర్ఆర్ఆర్' షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ లోనే రామ్ చరణ్ ఇంట్రో సీన్ పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ చిత్రీకరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ షెడ్యూల్లోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఇంట్రో సీన్ కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ మూడు ఇంట్రోలలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని కేవలం వీటి కోసమే చిత్ర బృందం 50 కోట్ల దాకా బడ్జెట్ ను వినియోగిస్తున్నట్లు గా సమాచారం అందుతోంది.

మామూలుగానే రాజమౌళి సినిమాలో హీరో ఎంట్రీ సీన్ లకు బాగా ప్రాధాన్యత ఉంటుంది పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీం లుగా కనిపించబోతున్నారు. కాబట్టి వీరిద్దరి ఇంట్రడక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు అందుకే అంత బడ్జెట్ ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఈ సినిమాను 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది.


లైవ్ టీవి


Share it
Top