అదిరిపోయే కలెక్షన్లతో జపాన్ లో దూసుకెళ్తున్న "ఆర్ ఆర్ ఆర్"

*అదిరిపోయే కలెక్షన్లతో జపాన్ లో దూసుకెళ్తున్న "ఆర్ ఆర్ ఆర్"

Rama Rao
Published on: 31 Oct 2022 11:19 AM IST
RRR Movie is Also Creating Records in Japan | Telugu Movie News
X

అదిరిపోయే కలెక్షన్లతో జపాన్ లో దూసుకెళ్తున్న "ఆర్ ఆర్ ఆర్"

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన "ఆర్ఆర్ఆర్" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. "బాహుబలి" తర్వాత రాజమౌళి ఈ సినిమాతో మరొక ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన ఈ సినిమా తాజాగా ఇప్పుడు జపాన్లో విడుదలైంది.

భారతదేశంలోనే కాక మిగతా దేశాల్లో కూడా కలెక్షన్ల తో హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం జపాన్లో విడుదలైన మొదటి వారంలోనే "ఆర్ఆర్ఆర్" సినిమా 73 మిలియన్ జపాన్ ఎన్ అనగా 4 లక్షల 95 వేల డాలర్లను నమోదు చేసుకుని జపాన్లో అంత భారీ కలెక్షన్లు అందుకున్న మొట్టమొదటి భారతీయ సినిమాగా పేరు తెచ్చుకుంది.

ఇక జపాన్ లో కూడా "ఆర్ఆర్ఆర్" హవా ఇప్పుడు బాగానే నడుస్తోందని చెప్పుకోవచ్చు. అలియా భట్ మరియు ఒలీవియా మోరస్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరన్, సముతిరఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎం ఎం కీరవాణి దర్శక సంగీతం అందించిన ఈ సినిమా ని డి వి వి ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Rama Rao

Rama Rao

Next Story