logo
సినిమా

'ఆర్ఆర్ఆర్' హీరోయిన్స్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

ఆర్ఆర్ఆర్ హీరోయిన్స్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
X
Highlights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' ...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమా అని రాజమౌళి చెప్పారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ల గురించి ఇప్పటికే చాలా పుకార్లు బయటకు వచ్చాయి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని హీరోయిన్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలియా భట్ కు ఇది తొలి తెలుగు సినిమా.

మరోవైపు హాలీవుడ్ నటి డైజీ ఎడ్గార్ జోన్స్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెకు కూడా తెలుగులో ఇది మొదటి సినిమానే. అంతేకాకుండా ఈ సినిమాలో నటించనున్న మరి కొందరు నటుల గురించి కూడా రాజమౌళి బయటపెట్టారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. అంతేకాక తమిళ్ యాక్టర్ సముతిరఖని కూడా ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story