RRR ఫస్ట్ లుక్ ఆగష్టు 15 నే ..

RRR ఫస్ట్ లుక్ ఆగష్టు 15 నే ..
x
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే .....

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే .. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా విడుదల చేయాలనీ చిత్ర బృందం ఆలోచనలో ఉందట ..ఎందుకంటే సినిమా నేపధ్యం కూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా జరిగే కథ కావడంతో అదే రోజున విడుదల చేయాలనీ చిత్ర బృందం ఆలోచనట .. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నారు .

ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుంది ఎన్టీఆర్ పక్కన ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు . ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ మరియు సయుద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు .. ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .. ఈ సినిమాని వచ్చే ఏడాది జూలై 30 న విడుదల చేయనుంది చిత్ర యౌనిట్ ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories