RRR Update: "ఆర్ ఆర్ ఆర్" కి గుమ్మడికాయ కొట్టనున్న దర్శక నిర్మాతలు

RRR Movie Director, Producers Said Shooting and Patch Work will be Complete in September 2021 | RRR Release Date
x

RRR Update: "ఆర్ ఆర్ ఆర్" కి గుమ్మడికాయ కొట్టనున్న దర్శక నిర్మాతలు

Highlights

RRR Update: తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 20 వ తేదీన ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నట్లు తెలుస్తోంది.

RRR Update: "బాహుబలి" తరువాత జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరొక పాన్ ఇండియన్ హై బడ్జెట్ చిత్రం "ఆర్ ఆర్ ఆర్". ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనుండగా, మరోవైపు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర అభిమానులకు దర్శనమివ్వనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే చిత్రబృందం ఉక్రెయిన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మిగతా షూటింగ్ మరియు ప్యాచ్ వర్క్ మొత్తం పూర్తి కావడానికి సెప్టెంబర్ అవుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 20 వ తేదీన ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి సెప్టెంబర్ 20 న "ఆర్ ఆర్ ఆర్ (RRR)" సినిమా షూటింగ్ లో ఆఖరి రోజు అని తెలుస్తోంది. మొదట సినిమాని అక్టోబర్ 13న విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రే స్టీవెన్సన్, అజయ్ దేవ్ గన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories