బాహుబలి కలెక్షన్లు దాటేసిన "అర్ఆర్ఆర్"

RRR Movie Broke the Bahubali Movie Full Collections in Three Days
x

బాహుబలి కలెక్షన్లు దాటేసిన "అర్ఆర్ఆర్" 

Highlights

*బాహుబలి కలెక్షన్లు దాటేసిన "అర్ఆర్ఆర్"

RRR Vs Bahubali: భారీ అంచనాల మధ్య మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన "అర్ఆర్ఆర్" సినిమా ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం సినిమా విడుదలై ఇంకా వారం కూడా పూర్తి కాలేదు కానీ అప్పుడే "బాహుబలి: ది బిగినింగ్" పూర్తి కలెక్షన్లను దాటేసి కొత్త రికార్డును సృష్టించింది. అమెరికాలో బాహుబలి ది బిగినింగ్ సినిమా పూర్తి రన్ లో 6.9 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అయితే ఆర్ ఆర్ సినిమా విడుదలైన మూడు రోజులకే ఈ నంబర్ ను దాటి 9.25 మిలియన్ డాలర్లను వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే బాహుబలి 2 కలెక్షన్లు 20 మిలియన్ డాలర్లు. "అర్ఆర్ఆర్" సినిమా బ్లాక్బస్టర్ టాక్ తో బాగానే ముందుకెళుతోంది.

ఈనేపథ్యంలో బాహుబలి2 కలెక్షన్ లు కూడా ఈ చిత్రం దాటడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏదేమైనా అమెరికాలో బాక్సాఫీస్ ని బద్దలు కొట్టే కలెక్షన్లు ఇచ్చిన మొదటి మూడు తెలుగు సినిమాల కి దర్శకత్వం వహించింది ఎస్.ఎస్.రాజమౌళి నే కావటం విశేషం. తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు రాజమౌళి.

Show Full Article
Print Article
Next Story
More Stories