RRR Movie: 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కు భారీగా పెరిగిన డిమాండ్

RRR Makers Willing To Wait For A Good Deal
x

ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్

Highlights

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు పంపిణీదారుల నుంచి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది.

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు పంపిణీదారుల నుంచి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆయన సినిమాలు నిర్మాణ దశలో ఉన్నప్పుడే రీమేక్‌లు, శాటిలైట్ రైట్స్, డిజిటల్ హక్కులకు పోటీ నెలకొంటుంది.

రాజమౌళి తాజా చిత్రం "ఆర్ఆర్ఆర్" విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే, ఇదే అదునుగా ఆర్ఆర్ఆర్ టీం కూడా భారీగానే ఆశిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

"సింహాద్రి", "మగధీర" "ఈగ", "బాహుబలి" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఒలివియా మోరిస్, అలియా భట్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమాతో బిజీగా ఉన్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా క్లైమాక్స్ దశలో ఉంది.

ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 న విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయించారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న "ఆర్ఆర్ఆర్" ఇంకా నిర్మాణంలో ఉంది. కానీ, శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం డిమాండ్ బాగా పెరిగింది.

తాజా సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్, స్టార్ మా లు ఈ సినిమా OTT స్ట్రీమింగ్ హక్కులు, శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి.

ఓటీటీ కోసం రూ. 130 కోట్లు, శాటిలైట్ రైట్స్ కోసం రూ. 160 కోట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో దేనిని ఇంకా టీం ఫైనల్ చేయలేదు. ఇదిలా ఉంటే, 'ఆర్ఆర్ఆర్' సినిమాకు అధిక డిమాండ్ ఉన్నందున ఇంకా ఎక్కువ మొత్తం ఆశిసిస్తున్నట్లు టాక్.

అమెజాన్ ప్రైమ్, స్టార్ మాలకే కాక నెట్‌ఫ్లిక్స్, జెమిని టీవీ లు కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 400-450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అదే రేంజ్ లో రిటర్స్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ హక్కులను ఎవరు, ఎంతకు దక్కించుకుంటారోనని ఇండస్ట్రీ అంతా వేచి చూస్తుంది. భారీ ధరకు అమ్ముడుపోతే ఆర్ఆర్ఆర్ మూవీ నిజంగా రికార్డ్ క్రియోట్ చేసినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories