The Academy: ట్రిపులార్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్‌ పోస్టర్‌లో మూవీ స్టిల్‌..!

RRR Gets Rare Honor Featured in Oscars New Stunt Design Category Announcement Poster
x

The Academy: ట్రిపులార్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్‌ పోస్టర్‌లో మూవీ స్టిల్‌..!

Highlights

The Academy: తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కడం అనేది ఒక కల. అయితే ఈ కలను నిజం చేసి చూపించారు దర్శకుడు రాజమౌళి.

The Academy: తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కడం అనేది ఒక కల. అయితే ఈ కలను నిజం చేసి చూపించారు దర్శకుడు రాజమౌళి. ట్రిపులార్‌ చిత్రంలో నాటు నాటు పాట ఆస్కార్‌ అవార్డును అందుకోవడంతో తెలుగు సినిమా రేంజ్‌ ప్రపంచ స్థాయికి చేరుకుంది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ సినిమా దృష్టి మన టాలీవుడ్‌పై పడింది. అయితే తాజాగా ట్రిపులార్‌ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది.

ప్రపంచ సినీ అభిమానులందరికీ ఆస్కార్ అవార్డులు అంటే గౌరవ సూచకంగా భావిస్తారనే విషయం తెలిసిందే. ప్రతి కళాకారుడు ఈ బహుమతిని కలగా భావిస్తారు. తాజాగా ఆస్కార్ అకాడమీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాల్లో కీలక భాగంగా మారిన స్టంట్ డిజైన్ కేటగిరీకి ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ, 2027 నుంచి ఈ విభాగంలో కూడా అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త కేటగిరీ గురించి అకాడమీ అధికారికంగా తెలిపింది – “స్టంట్లు సినిమాల్లో ప్రాథమిక స్థాయిలో ఉండే కళ. దీనిలో ఉన్న క్రియేటివిటీ, కష్టాన్ని గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉంది,” అని పేర్కొన్నారు. ఈ కేటగిరీని 100వ ఆస్కార్ వేడుకలలో మొదటిసారిగా అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు.

ట్రిపులార్‌ మూవీకి అరుదైన గుర్తింపు..

ఇదిలా ఉంటే ఈ విషయాన్ని తెలియజేసే సమయంలో ఆస్కార్‌ నిర్వాహకులు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మూడు సినిమాల స్టంట్ సన్నివేశాలు చూపించారు. వాటిలో ట్రిపులార్‌ సినిమా విజువల్‌ కూడా ఒకటి ఉండడం విశేషం. 'ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌', 'మిషన్‌ ఇంపాజిబుల్‌' సినిమాలతో పాటు ట్రిపులార్‌ మూవీ పోస్టర్‌ ఉండడం అద్భుతమైన విషయంగా చెప్పొచ్చు. ఇప్పుడీ ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది ఇండియన్‌ సినిమా రేంజ్‌కు నిదర్శమని ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా ఆస్కార్‌లో స్టంట్ డిజైన్ కేటగిరీ ప్రవేశపెట్టడంపై దర్శకుధీరుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. “100 సంవత్సరాల పాటు ఎదురు చూసిన కల నెరవేరింది. స్టంట్ మాస్టర్స్‌, టెక్నీషియన్లు, స్టంట్ యాక్టర్స్‌ అందరికీ ఇది గౌరవార్థం. అకాడమీకి హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ పోస్ట్‌ చేశారు. అంతేగాక, విడుదలైన పోస్టర్‌లో 'ఆర్ఆర్ఆర్' విజువల్స్ చూసి ఎంతో ఆనందించానని పేర్కొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories