logo
సినిమా

ఆర్ఆర్ఆర్ విడుదలకి మళ్లీ అడ్డంకులు

RRR Barriers again to release
X

ఆర్ఆర్ఆర్ విడుదలకి మళ్లీ అడ్డంకులు

Highlights

RRR Movie: ఇన్ని అవరోధాలను ఆర్ఆర్ఆర్ దాటగలదా?

RRR Movie: ఎప్పటికప్పుడు అభిమానులను నిరాశపరుస్తూ ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్న సినిమాలలో "ఆర్ ఆర్ ఆర్" కూడా ఒకటి. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకి జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 7 నుంచి వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 25న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ నిజానికి మార్చ్, ఏప్రిల్ లో పెద్ద సినిమాలు విడుదల అవ్వడం తక్కువ. ఎందుకంటే అది ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి. పైగా ఈ సంవత్సరం జనవరిలో కరోనా కారణంగా విద్యా సంస్థలు కూడా మూతపడడంతో విద్యార్థులకు మార్చి ఏప్రిల్ సమయంలోనే పరీక్షలు పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

మరోవైపు వాయిదాపడిన ఐపీఎల్ కూడా మార్చ్ లేదా ఏప్రిల్ మొదటి వారంలోనే మొదలు కాబోతుంది. ఈసారి 10 ఐపీఎల్ టీం లు ఆడడానికి సిద్ధంగా ఉండటంతో ఐపీఎల్ సీజన్ ఇంకా పెద్దగా ఉండబోతోంది. ఇవన్నీ "ఆర్ ఆర్ ఆర్" సినిమా కలెక్షన్లను దెబ్బతీస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఎలా అయినా సినిమా అన్ని అడ్డంకులను దాటి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు చెబుతున్నారు. అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Web TitleRRR Barriers again to release
Next Story