మూడు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వేంటి చెప్పేది..రెచ్చిపోయిన రోజా!

మూడు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వేంటి చెప్పేది..రెచ్చిపోయిన రోజా!
x
Roja File Photo
Highlights

మాజీ హీరోయిన్‌గా, రాజకీయాల్లోనూ.. బ్రతకుజట్కాబండిలోనూ రోజా ఎక్కడుంటే అక్కడ సంచలనమే. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా తన మార్క్ చూపించే రోజా టీవీలో...

మాజీ హీరోయిన్‌గా, రాజకీయాల్లోనూ.. బ్రతకుజట్కాబండిలోనూ రోజా ఎక్కడుంటే అక్కడ సంచలనమే. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా తన మార్క్ చూపించే రోజా టీవీలో న్యాయనిర్ణేతగా అంతకంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..

'రోజా సెల్వమణి' నటిగా ఎంత బీజీగా ఉండేవారో.. ఈటీవీలో జబర్దస్త్ పోగ్రామ్ లో అంతకంటే బీజీగా ఉన్నారు. ఆమె ప్రజాపతినిధి అయినా జబర్ధస్త్ విషయంలో రోజా ఎప్పడు వెనకడుగు వేయలేదు. ఆమెతో పాటు నాగబాబు ఆదే కార్యక్రమాన్ని న్యాయనిర్ణేతగా మొన్నటి వరకు వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన జబర్ధస్త్ కార్యక్రమాన్ని వదిలేశారు. ఇకపోతే, రాజకీయంగా నాగబాబుతో కానీ, నాగబాబు కుటుంబంతో గానీ మెగస్టార్ తో కానీ, పవర్ స్టార్ కొణిదల పవన్ కళ్యాన్ తో కానీ ఆమెకు ఎప్పుడు సయోధ్య లేదు. అయితే రాజకీయాలు వేరు.. నటన వేరు అంటూ రోజా చెబుతూవస్తారు.

కానీ, ఇటీవల నాగబాబు జబర్ధస్త్ వదిలిన తర్వాత రోజా వైఖరిలో మార్పు కనిపిస్తుంది. రాజకీయ వేదికలపైతప్ప మరెక్కడా కొణిదల ఫ్యామిలీపై మరీ ముఖ్యంగా పవన్ కళ్యాన్ పై ఎప్పుడు నేరుగా రోజా వ్యాఖ్యానించిన సందర్భాలు లేవు. అయితే ఈ రోజు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఓ ప్రముఖ చానల్ లో ప్రసారమైన వినోద కార్యక్రమంలో భాగంగా ఆమె చేసిన ఓ స్కిట్ ప్రేక్షకుల్లో అనుమాలు రేకెత్తించింది. స్కిట్ లో భాగంగా ఒకటికి పది సార్లు #మూడు పెళ్లిల్లు చేసుకున్న' నువ్వా మాట్లాడేది అంటూ ఆమె డైలాగ్ లు వల్లించారు. ఇది నేరుగా జనసేనాని పవన్ కళ్యాన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గానే అందరు భావిస్తున్నారు. ఎందుకంటే , ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ అధినేత పదే పదే జనసేనాని పవన్ కళ్యాన్ ను బహిరంగ వేదికలపైన #మూడు పెళ్లిళ్లు'చేసుకున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు రోజా స్కిట్ లో భాగంగా చేసినా సరే, ఈ వ్యాఖ్యలు నేరుగా జనసైనికుల హృదయాన్ని తాకాయి.

సరికొత్తగా ప్రారంభమవుతున్న నవదశాబ్ధి ప్రారంభంలోనే పవన్ కళ్యాన్‌పై రోజా మాటల దాడి (అది స్కిట్ రూపంగానే) సరికొత్త వివాదానికి అజ్యాం పోసేలా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్కిట్ ఇప్పుడు ఇప్పుడే ప్రసారం కావడంతో జనసైనికుల ప్రతిస్పందన ఇంకా పూర్తిగా అందుబాటులోలేదు. మొత్తం మీద ఈ వ్యవహారం కొత్త సంవత్సరంలో మరి ముఖ్యంగా చలి వాతావరణంలో వేడి పుట్టించేలా మారిపోయిందని విశ్లేషకుల అభిప్రాయం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories