రజనీకి 'కరోనా' అంటూ పోస్ట్.. అభిమానులకు అడ్డంగా దొరికిన నటుడు

రజనీకి కరోనా అంటూ పోస్ట్.. అభిమానులకు అడ్డంగా దొరికిన నటుడు
x
Rohit Roy, superstar Rajinikanth(File photo)
Highlights

ఒక నటుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ పైనే జోకులు పేలాడు.. దాంతో అభిమానులకు అడ్డంగా దొరికి చివాట్లు తింటున్నాడు.

ఒక నటుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ పైనే జోకులు పేలాడు.. దాంతో అభిమానులకు అడ్డంగా దొరికి చివాట్లు తింటున్నాడు.గురువారం సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని నటుడు రోహిత్ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. దాంతో ఇది నిజమనుకొని రజిని అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఆందోళనలో ఉన్న అభిమానులకు కొద్దిసేపటికే అది నిజం కాదని తెలిసింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా న‌టుడు రోహిత్ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో "ర‌జ‌నీకాంత్‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. కానీ క‌రోనా క్వారంటైన్‌లో ఉంది" అని పోస్ట్ పెట్టాడు. ఏ క్రమంలో నిమిషాల్లో ఆ పోస్ట్ వైరల్ అయింది. కొందరు అభిమానులు ఖంగారుతో వెబ్సైట్లలో న్యూస్ కోసం వెతుకులాట ప్రారంభించారు.

అయితే ఎక్కడా దీనికి సంబంధించిన వార్త రాలేదు.. పైగా కాసేపటికే ఆ పోస్ట్ జోక్ అని తేలింది. దాంతో నెటిజ‌న్లకు దొరికిపోయాడు రోహిత్ రాయ్.. ఈ పోస్ట్ చేసినందుకు ఆయనను విపరీతంగా తిట్టిపోస్తున్నారు. 'జోక్ పరమ చెత్త‌గా ఉంది', 'ఇలాంటి జోక్ భార‌తీయ సంస్కృతి కాదు', 'క‌రోనా కామెడీ కాదు, ఇటువంటి తప్పుడు వార్తలు ఒక నటుడు స్థానంలో ఉండి ఎలా ప్రచారం చేస్తారు అంటూ దుమ్మెత్తిపోశారు.. ఆ పోస్ట్ నిన్న పెట్టినప్పటికీ ఇప్పటికీ రోహిత్ రాయ్ పై రజిని అభిమానులు భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories