Rajinikanth: మళ్లీ రిపీట్ కాబోతున్న రోబో కాంబో

Rajinikanth : ఈ మధ్యనే "అన్నాతే" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఇప్పుడు దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

admin1
Updated on: 19 Feb 2022 4:18 PM IST
Robo Combo to Be Repeated
X

Rajinikanth: మళ్లీ రిపీట్ కాబోతున్న రోబో కాంబో

Rajinikanth: ఈ మధ్యనే "అన్నాతే" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఇప్పుడు దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #తలైవర్169 అని పిలవబడుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రావిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ అని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ "పొన్నియన్ సెల్వన్" సినిమాతో బిజీగా ఉన్నారు. విక్రమ్, కార్తి, జయరామ్, త్రిష తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గతంలో కూడా శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాలో రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది ఐశ్వర్యరాయ్. మరి ఇన్ని ఈ నెల తర్వాత మళ్ళీ ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ సరసన నటిస్తుంది లేదో తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story