"నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం" అంటున్న కన్నడ హీరో

Rishab Shetty Said that Jr NTR is his all Time Favorite Hero From Tollywood
x

"నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం" అంటున్న కన్నడ హీరో

Highlights

"నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం" అంటున్న కన్నడ హీరో

Rishab Shetty: "కాంతారా" సినిమా కారణంగా గత కొంతకాలంగా కన్నడ హీరో రిషబ్ శెట్టి పేరు బాగానే వైరల్ అవుతోంది. అన్నీ భాషలలోనూ ఈ సినిమా చాలా ప్రేక్షకుల దృష్టిని చాలా బాగా ఆకర్షించింది. తాజాగా కాంతారా హిందీ వెర్షన్ థియేటర్‌లోకి వచ్చిన సందర్భంగా రిషబ్ శెట్టి ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ తన అభిమాన టాలీవుడ్ నటుడు ఎవరు అని తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాన హీరో అని చెప్పారు రిషబ్ శెట్టి. టాలీవుడ్ నుండి జూనియర్ ఎన్టీఆర్ తనకి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అని రిషబ్ శెట్టి అన్నారు.

"మహేష్ బాబు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారు, కానీ నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. అతని తల్లి కూడా మా కన్నడ ఆమెనే కాబట్టి మా ఇద్దరి మధ్య ఇంకో అనుబంధం ఉంది," అని అన్నారు రిషబ్ శెట్టి. ఇక ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలి అనుకుంటున్నారా అని అడగగా, "నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కథ మరియు మంచి కాన్సెప్ట్ వస్తే మాత్రమే నేను నిర్ణయించగలను" అని అన్నారు. ఇక సెప్టెంబర్ 30 న థియేటర్లలో విడుదలైన "కాంతారా" కర్ణాటక బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories