logo
సినిమా

RGV Tweet: గత 20 ఏళ్ళలో విజయ్ దేవరకొండ లాంటి హీరోని చూడలేదు

RGV Says about Vijay Deverakonda in Liger Is Greater than any Star I have seen in the Last 2 Decades
X

విజయ్ దేవరకొండ , రామ్ గోపాల్ వర్మ (ఫైల్ ఫోటో )

Highlights

RGV Tweet About Vijay: రామ్ గోపాల్ వర్మ ఈ పేరు తెలియని సగటు ప్రేక్షకుడు బహుశా ఉండకపోవచ్చు. అది అతను చేసిన సిని...

RGV Tweet About Vijay: రామ్ గోపాల్ వర్మ ఈ పేరు తెలియని సగటు ప్రేక్షకుడు బహుశా ఉండకపోవచ్చు. అది అతను చేసిన సినిమాల వల్లనో లేదా సినిమా స్టార్ ల మీద ట్విట్టర్ వేదికగా చేసే ప్రశంసల వల్లనో, విమర్శల వల్లనో తెలిదు కాని రామ్ గోపాల్ వర్మ అందరికి సుపరిచితుడే. "శివ" సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ గోపాల్ వర్మ కెరీర్లో తన మొదటి సినిమాతోనే బెస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు తో పాటు నంది అవార్డులను సొంతం చేసుకొని సైకిల్ చైన్ లాగి తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. తన కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఆర్జీవి తాజాగా ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండ గురించి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

గత ఇరవై ఏళ్ళ నుండి "లైగర్" లో కనిపించబోతున్న విజయ్ దేవరకొండ లాంటి హీరోని ఇప్పటివరకు చూడలేదని ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్ కి సినిమా నిర్మాతలో ఒకరైన ఛార్మికి ఇలాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నందుకు ధన్యవాదములు అంటూ ట్వీట్ చేశాడు. అయితే అంతకు ముందు లైగర్ లోని కొన్ని సన్నివేశాలు చూశానని ట్వీట్ చేసిన కాసేపటికే ఆర్జీవి ఈ కామెంట్స్ చేయడంతో అటు రౌడీ బాయ్ దేవరకొండ అభిమానులకు తమ అభిమాన హీరో ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడోనని మరింత ఆసక్తితో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.


Web TitleRGV Says about Vijay Devarakonda in Liger Is Greater than any Star I have seen in the Last 2 Decades
Next Story