'ఇది మహాభారతం కాదు' వెబ్ సిరీస్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ

ఇది మహాభారతం కాదు  వెబ్ సిరీస్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ
x

రాంగోపాల్ వర్మ ఫైల్ ఫోటో 

Highlights

రామ్ గోపాల్ వర్మ బోల్డ్, పొలిటికల్ సెటైరికల్ డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను తికమక పెడుతుంటాడు.

రామ్ గోపాల్ వర్మ బోల్డ్, పొలిటికల్ సెటైరికల్ డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను కన్ఫూజ్ చేస్తుంటాడు. గత కొన్నేళ్లుగా వర్మ తీస్తున్న సినిమాలు నిత్యం చర్చల్లో నిలుస్తున్నాయి. తాజాగా అలాంటి మరో డిఫరెంట్ మూవీ ప్రకటించేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా సినిమాలు విడుదల చేస్తున్న వర్మ తాజాగా మరో చిత్రాన్ని పరిచయం చేయనున్నారు. వర్మ 'ఇది మహాభారతం కాదు' అనే డిఫరెంట్ సినిమా ప్రకటించారు. ఈమూవీ టైటిల్ లుక్ సహా ఆడియో పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు.

మహాభారతానికి లింక్ చేస్తూ వర్మ సినిమా చేస్తుండటం చర్చల్లో నిలుస్తోంది. సిరాశ్రీ రచనపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కి రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. 'ఇది మహాభారతం కాదు' అనే డిఫరెంట్ సినిమాకి ''గిది 2019ల తెలంగాణలో ధర్మన్న, దుర్యన్న ఫ్యామిలీల నడిమిట్ల లొల్లి లేపిన ద్రుపది, కొట్లాట పెట్టిన గోపాల్ యాదవ్ గాని కథ ఆధారంగా తీస్తున్న వెబ్ సిరీస్'' అని వర్మ ప్రకటించడం విశేషం. ఇక ఆడియో పోస్టర్‌లో అయితే.. మహాభరతంలో కనిపించే పాత్రలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయని, తెలంగాణలోని ఓ పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారని, దీని ఆధారంగా తాము వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నామని తన వాయిస్ తో చెప్పారు.



Show Full Article
Print Article
Next Story
More Stories