Renu Desai: పవన్‌తో ఆద్య సెల్ఫీ.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన రేణు దేశాయ్‌..!

Renu Desai Shares Pawan Kalyan Photo With Daughter Aadhya
x

Renu Desai: పవన్‌తో ఆద్య సెల్ఫీ.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన రేణు దేశాయ్‌..!

Highlights

Renu Desai: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో రేణు దేశాయ్‌ ఒకరు.

Renu Desai: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో రేణు దేశాయ్‌ ఒకరు. పవన్‌తో విడాకుల తర్వాత ఇద్దరు పిల్లల బాధ్యతను చూసుకుంటున్న రేణు.. అటు పలు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. అయితే ఇదే సమయంలో నెట్టింట నిత్యం ఏదో రకంగా ట్రోల్స్‌ను ఎదుర్కొంటూ వాటికి ధీటుగా సమాధానం చెబుతూ ముందుకు సాగుతున్నారు రేణు దేశాయ్‌.

ఇక తన పిల్లలకు సంబంధించి నిత్యం ఏదో ఒక పోస్ట్ చేసే రేణు దేశాయ్‌.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. కూతరు ఆద్య పవన్‌తో దిగిన సెల్ఫీ ఫొటోను పోస్ట్ చేసిన రేణు ఆసక్తికరమైన క్యాప్షన్‌ రాసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే ఈ కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్‌ కూతురు ఆద్య కూడా హాజరైంది. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ ఆద్యతో కలిసి తీసుకున్న సెల్ఫీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేసిన రేణు దేశాయ్‌.. ‘‘నాన్నతోపాటు స్వాతంత్ర్య దినోత్సవానికి వెళ్లనా?’ అని ఆద్య నన్ను అడిగింది. తండ్రితో సమయాన్ని గడపాలనుకోవడం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తను చూడాలనుకోవడం నాకు ఆనందం కలిగించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం వాళ్ల నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది. ఆయన్ను ప్రశంసించింది’’ అని రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories