ఇది పచ్చి అబద్ధం..ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం : రేణూ దేశాయ్

ఇది పచ్చి అబద్ధం..ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం : రేణూ దేశాయ్
x
Renu Desai
Highlights

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ నటిస్తోన్న వకీల్‌ సాబ్‌ సినిమాలో తాను నటిస్తున్నానంటూ వస్తోన్న వార్తలను రేణూ దేశాయ్ ఖండించింది....

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ నటిస్తోన్న వకీల్‌ సాబ్‌ సినిమాలో తాను నటిస్తున్నానంటూ వస్తోన్న వార్తలను రేణూ దేశాయ్ ఖండించింది. 'ఇది పచ్చి అబద్ధం.. ఎవరో రూమర్లు స్టార్ట్ చేశారు. అసలు రూమర్లు స్టార్ట్ చేసే ఇంత సమయం వారికి ఎలా ఉంటుంది. ఇటువంటి వారి తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది'. అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం తాను ఏ సినిమాలోనూ నటించడం లేదని స్పష్టం చేశారు రేణూ దేశాయ్. దయచేసి ఇలాంటి రూమర్లకు చెక్ పెట్టండి.. ప్రస్తుతం కరోనా విజృంభనను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయండి అన్నారు. ఇంట్లో పెద్ద వారిని బాగా చూసుకోవాలని రేణూ దేశాయ్ సూచించింది. తన కూతురు ఆధ్యా స్కేటింగ్‌, పెయింటింగ్‌, డ్రాయింగ్‌, శాండ్‌విచ్‌ కుకింగ్‌ బాగా చేస్తుందని ఆమె తెలిపింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories