రేణూదేశాయ్‌ సంచలన వ్యాఖ్యలు

రేణూదేశాయ్‌ సంచలన వ్యాఖ్యలు
x
రేణూదేశాయ్‌
Highlights

కుమారుడు అకీరా ఫోటోపై పవన్ కళ్యాణ్ అభిమాని పెట్టిన కామెంట్ పై ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

సినీనటి రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారుడు అకీరా ఫోటోపై పవన్ కళ్యాణ్ అభిమాని పెట్టిన కామెంట్ పై ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినీనటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌ రేణుదేశాయ్ వివాహబంధం తెగిపోయి చాలా కాలం అవుతుంది. ఇద్దరూ ఏవరి వ్యక్తిగత జీవితం వారు గడుపుతున్నారు. అయితే కొందరు పవన్ అభిమానులు మాత్రం రేణుదేశాయ్ సోషల్ మీడియాలో తరచూ వారి ఇద్దరి రిలేషన్ పై చెస్తు్న్న కామెంట్స్ ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే తాజాగా ఓ అభిమాని చేసిన కామెంట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

ఇటీవలే రేణూ దేశాయ్ తన కుమారుడు అకీరానంద్ సోదరి ఆద్యను ఎత్తుని దిగిన ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 123 అనేలోగా మీ ముందు ఉంటానంటూ అకీరా, ఆద్య ఇద్దరూ క్రేజీ ఫెల్లోస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీనిపై పవన్ కళ్యాన్ అభిమాని ఒకరు ఎంతైనా పవన్ రక్తం కదా అని కామెంట్ చేశాడు. దీనిపై రేణూ దేశాయ్ సిరీయస్ అయ్యారు. టెక్నికల్‌గా చూసుకున్నా, సైన్స్‌ పరంగా చూసినా ఇద్దరిలో వహించేది నా రక్తమే సైన్స్ తెలిస్తే వారికి ఈ సంగతి చెప్పనక్కర్లేదు. అంటూ ఆ అభిమానికి స్ట్రాంగ్ కౌంటర్ రిప్లై ఇచ్చింది. మరో నెటిజన్ స్పందించి ప్రతి అభిమాని ఎదో ఒకటి మాట్లాడతారు వాటిని పట్టింకుకోకండి అంటూ సలహా ఇచ్బాడు. దీనిపై స్పందించినా రేణూ దేశాయ్ అమ్మప్రేమ గురించి మాట్లాడితే ఏలా అంటూ బదులిచ్చారు.

ప్రస్తుతం రేణూ దేశాయ్ పిల్లలతో కలిపి పూణెలో నివశిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ నుంచి విడిపోయిన తర్వాత నుంచి పిల్లలే రేణూ దేశాయ్ జీవిస్తుంది. ఆ మధ్యలో ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే తనకు ఓ తోడును వెతుక్కోబోతున్నానంటూ తెలిపింది. అందుకు తగ్గట్లుగానే కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ, 4, 5 నెలలు గడుస్తోన్న పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు రేణూదేశాయ్. రేణూదేశాయ్ పిల్లలకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ను నెటిజన్లతో పంచుకుంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories