తన పాటను తానే రీమిక్స్ చేసుకుంటున్న బాలయ్య!

తన పాటను తానే రీమిక్స్ చేసుకుంటున్న బాలయ్య!
x
Balakrishna, Boyapati, Anjali (File Photo)
Highlights

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది.

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. వివిధ కారణాలతో లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్స్ కి ఛాన్స్ ఉండగా మొదటి హీరోయిన్ గా అంజలిని ఫిక్స్ చేశారు. ఇంకా రెండో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో తనపాటని రిమీక్స్ చేయాలనీ బాలకృష్ణ అనుకుంటున్నారని ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ నటించిన 'బంగారు బుల్లోడు' సినిమాలోని "స్వాతిలో ముత్య‌మంత ముద్దులా సందె వానా" అనే పాటను బాలకృష్ణ, బోయపాటి సినిమాలో పెట్టాలని అనుకుంటున్నారట! ఇక ఈ పాటను బాలకృష్ణ, అంజలి పైన షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట! దీనిపైన తమన్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నాడట!

ఇక అప్పట్లో ఈ పాట ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సాంగ్ లో రవీనా టాండన్ తో కలిసి బాలయ్య వర్షంలో తడుస్తూ స్టెప్పులు వేశాడు. అయితే ఇప్పుడు ఇదే పాటను రీమిక్స్ చేస్తుండడంతో హైప్ క్రియేట్ అయింది. ఇక ఇప్పటికే ఈ పాటను అల్లరి నరేశ్ యాక్షన్ 3D అనే సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే..

ఇక ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా హీరో రాజశేఖర్, శ్రీకాంత్, సునీల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి కానీ దీనిపైన చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేదు. గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ సినిమాలతో నిరాశపరిచిన బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమాని చేస్తుండడంతో అభిమానులు ఈ సినిమాపైన అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories