Tollywood: టాలీవుడ్‌లో చిన్న చిత్రాల సందడి

Release of Six Films in One Week | Tollywood
x

Tollywood: టాలీవుడ్‌లో చిన్న చిత్రాల సందడి

Highlights

Tollywood: ఒకేవారం ఆరు సినిమాల విడుదల

Tollywood: టాలీవుడ్ లో రెండేళ్లుగా రిలీజ్ సిద్దంగా ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు విడుదలకు వరుస కడుతున్నాయి. భారీ చిత్రాలు, స్టార్స్ నటించిన సినిమాలు వచ్చి వెళ్లిన తరుణంలో , వారం వారం చిన్న సినిమాల తాకిడి ధియేటర్స్‌కు పెరిగింది.

ప్రతి ఏడాది టాలీవుడ్ లో విడుదలయ్యే వంద సినిమాల్లో తొంబై చిన్న సినిమాలే ఉంటాయి. గత రెండేళ్లుగా చాలా వరకు చిన్న సినిమాలు రిలీజ్ కు నోచుకోక , అనువైన సమయం కోసం వేచి చూస్తున్నాయి. అలా ఎప్పట్నుంచో ల్యాబ్స్ లో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వారం వారం చాలా సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. టాలీవుడ్ కు అన్ సీజన్ అయిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పరిస్థితి ఇదువరలో ఎక్కువగా ఉండేది.

కరోనా తర్వాత మారిన పరిస్థితుల వల్ల ఆ రెండు నెలల్లో భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావటం, వేసవి అంతా పెద్ద సినిమాల సందడి కొనసాగటంతో .. తాజాగా మీడియం రేంజ్ సినిమాలు రిలీజవుతున్నాయి. నెలలో రెండు వారాలు చిన్న సినిమాల విడుదలకు వదిలేయటంతో ,ఒకేసారి అరడజను సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందండి చేసెస్తున్నాయి.

రామ్ గోపాల్ వర్మ 'కొండా' , కిరణ్ అబ్బవరం‌ 'సమ్మతమే' , పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా చేసిన 'చోర్ బజార్' , ఎంఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్', శ్రీరామ్ నటించిన టెన్త్ క్లాస్ డైరీస్, గ్యాంగ్ స్టర్ గంగరాజు లాంటి చిన్న సినిమాలు ఒకేసారి ధియేటర్స్ లోకి వస్తున్నాయి. ‌నిజానికి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెద్ద స్టార్ మూవీస్ కే సరైన ప్రేక్షకాదరణ దక్కటం లేదు. దానికి తోడు విడుదలవుతున్న చిన్న సినిమాలకు సరైన బజ్ లేకపోవడంతో ఆడియన్స్ కూడా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాల తరహాలోనే , ఇలా వచ్చి అలా వెళ్లిపోయేలాగే స్మాల్ బడ్జెట్ సిమిమాల విడుదల కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories