logo
సినిమా

మళ్ళీ వాయిదా పడిన యువ హీరో సినిమా

మళ్ళీ వాయిదా పడిన యువ హీరో సినిమా
X
Highlights

ఎప్పటినుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం 'ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్...

ఎప్పటినుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం 'ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి)' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం మలయాళం సినిమా రీమేక్ గా తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం విడుదల తేది మళ్ళీ వాయిదా వేయనున్నారు అని వార్తలు వస్తున్నాయి. మొదట మార్చి 1 న సినిమాను విడుదల చేద్దామనుకున్నారు కానీ కుదురకపోవడంతో మార్చి 21కి వాయిదా వేశారు.

అయితే, తాజాగా ఆ రోజు కూడా సినిమా విడుదలకావట్లేదని తెలుస్తుంది. నిర్మాణాంతర పనుల్లో ఆలస్యం కావడంతో సినిమాని ఏప్రిల్లో విడుదల చేద్దామని అనుకున్నారట. ఈ కొత్త విడుదల తేదీ ఫై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ సొంతం చేసుకుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుంది. జూదా శాండీ సంగీతం అందిస్తున్నారు.

Next Story