OTT: ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్‌ మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

Rekhachitram Gripping Malayalam Crime Thriller Streaming on OTT in Telugu from March 7
x

OTT: ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్‌ మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

Highlights

OTT: ఇటీవల మలయాళ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగో క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చే మూవీలకు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి ఆదరణ లభిస్తోంది.

OTT: ఇటీవల మలయాళ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగో క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చే మూవీలకు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటా మూవీ.? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మలయాళంలో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న "రేఖచిత్రం" అనే క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రానుంది. జనవరి 9న విడుదలైన ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ పోలీస్ ఆఫీసర్‌గా నటించగా, అనశ్వర రంజన్ కీలక పాత్ర పోషించింది. మనోజ్ జయన్, సిద్ధిఖీ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. రూ. 6 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 66 కోట్ల వసూళ్లు సాధించింది. బుక్ మై షోలో 40,000కు పైగా ఓట్లు రాగా, IMDBలో 8.8 రేటింగ్ సంపాదించింది.

సోనీ లివ్ స్ట్రీమింగ్ హక్కులు పొందిన ఈ చిత్రం మార్చి 7 అర్ధరాత్రి నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. జోపిన్ టి. చాకో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు. కథలో, ఓ పట్టణంలో వరుస హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. అన్వేషణలో ఊహించని నిజాలు బయటికొస్తాయి. అసలు నేరస్తులు ఎవరు? ఈ హత్యల వెనుకున్న కారణమేంటి? తెలుసుకోవాలంటే "రేఖచిత్రం" తప్పక చూడాలి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories