కాల్ మీ నాగ్ ... నీకోసం ఇప్పటికి వెయిటింగ్

కాల్ మీ నాగ్ ... నీకోసం ఇప్పటికి వెయిటింగ్
x
Highlights

శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఆకాష్, రేఖ వేదవ్యాస్ హీరోహేరోయిన్స్ గా నటించారు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఆకాష్, రేఖ వేదవ్యాస్ హీరోహేరోయిన్స్ గా నటించారు. తిట్టుకుంటూనే ప్రేమలో పడిపోయే పాత్రల్లో వాళ్ళు ఇద్దరు అద్భుతంగా నటించారు. 2001లో వచ్చిన ఈ చిత్రం లవర్స్ కి బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో హీరోయిన్ రేఖకి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలలో నటించింది. ఇక 2008 లో వచ్చిన నిన్న నేడు రేపు సినిమా తర్వాత మొత్తం సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది ఈ భామ..

అయితే తాజాగా అలీ హోస్ట్ గా చేస్తున్న అలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో పాల్గొన్న రేఖ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అందులో భాగంగా హీరో నాగర్జున నటించిన మన్మధుడు సినిమాలో గెస్ట్ రోల్ చేసింది . కానీ అంతకుముందు నాగార్జున తనకి నెక్స్ట్ మళ్లీ సినిమా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. నాగ్ సార్ ప్రామిస్ చేశారు. మీ కాల్ కోసం వెయిటింగ్ అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ..

ఈ సినిమాలో "వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా " అనే సాంగ్ లో రేఖ కనిపిస్తుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2002లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. గత ఏడాది దీనికి సీక్వెల్ వచ్చినప్పటికీ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది రేఖ.. అక్కడ కూడా కొన్నేళ్ల పాటు సినిమాలు చేసి ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక నాగ్ వైల్డ్ డాగ్ అనే అనే సినిమాని చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories